AP: మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలని చెప్పారు. ఇంజినీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.