GNTR: తెనాలి త్రీ టౌన్, చెంచుపేట ప్రాంతంలో ఆదివారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. సీఐ సాంబశివరావు నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. మైనర్లు వాహనాలు నడపడంపై పోలీసులు దృష్టి సారించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులను బాధ్యులను చేసి, కేసులు పెడతామని సీఐ సాంబశివరావు హెచ్చరించారు.