BPT: తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ నష్టం సంభవించకుండా ప్రజలకు భద్రత కల్పించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బాపట్ల జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో ప్రవేశ మార్గాలను పోలీసులు మూసివేశారు. తుపాను కారణంగా సముద్ర తీరాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. లోటట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.