PDPL: నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని, రామగిరి మండల తాహసీల్దార్ సుమన్ పేర్కొన్నారు. రామగిరి మండలం బేగంపేట శివారులో అనుమతి లేకుండా వేసిన వ్యవసాయ బోరును తాహసీల్దార్ సుమన్ ఆదేశాల మేరకు అధికారులు సీజ్ చేశారు . ఆదివారం పేటకు చెందిన ఏలువాక శంకరయ్య అనుమతి లేకుండా బోరు వేయగా, ఫిర్యాదు మేరకు విచారణ జరిపి బోరును సీజ్ చేశారు.