స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డతో దర్శకుడు రవికాంత్ పేరేపు తెరకెక్కిస్తోన్న సినిమా ‘బ్యాడాస్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఓ వార్త బయటకొచ్చింది. ఈ మూవీ కథ ఓ నటుడి జర్నీ అని, తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషన్ ఆధారంగా రాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.