GNTR: మంగళగిరి ఏయిమ్స్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 8 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ ప్రోగ్రామర్, లీగల్ ఆఫీసర్, బయో-మెడికల్ ఇంజనీర్ వంటి పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి 10+2 నుంచి డిగ్రీ, బీ.టెక్, ఎల్.ఎల్.బి. అర్హత ఉండాలి. ఎంపికైన వారికి నెలకు ₹54,870/- నుంచి ₹1,04,935/- వరకు జీతం లభిస్తుంది. ఈ పోస్ట్‌లకు నవంబర్ 15వ తేదీలోగా ఆప్లై చేసుకోవాలని ఏయిమ్స్ అధికారులు తెలిపారు.