ASR: ఈనెల 24న మావోయిస్టుల దేశవ్యాప్త బంద్ నేపథ్యంలో కొయ్యూరు మండలంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం ఎస్సై కిషోర్ వర్మ, మంప ఎస్సై శంకరరావుతో సీఐ శ్రీనివాసరావు స్టేషన్ ఎదుట వాహన తనిఖీలు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.