NLR: వర్షాలకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని ఆత్మకూరు డీఎస్పీ K. వేణుగోపాల్ తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు. వాగులు, చెరువులు, నదులు, లోతైన నీటి గుంటల వద్దకు ఎవరు వెళ్లవద్దని అన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నచోట ప్రయాణించవద్దని పేర్కొన్నారు.