MNCL: మందమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణలో SI రాజశేఖర్ ఆధ్వర్యంలో గురువారం ‘ఓపెన్‌హౌస్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై పోలీసుల విధులను దగ్గర నుంచి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులకు ప్రస్తుత సమాజంలో కీలకంగా మారిన పలు అంశాలపై పోలీసులు సమగ్ర అవగాహన కల్పించారు.