BPT: సంతమాగులూరు మండలంలోని ప్రజలకు మండల హౌసింగ్ ఏఈ ఎర్రకోటయ్య గురువారం కీలక సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 5 లక్షల మందిని ప్రభుత్వం గుర్తించిందన్నారు. అలాగే మండల పరిధిలోని ప్రజలు నూతనంగా ఇల్లు కట్టుకునే వారికి నవంబర్ 5వ తేదీలోగా అధికారులను సంప్రదించాలన్నారు.