పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్‌కు తెహ్రీక్-ఇ-తాలిబన్(టీటీపీ) హెచ్చరికలు జారీ చేసింది. దమ్ముంటే తమను ఎదుర్కోవాలని టీటీపీ కమాండర్ కాజిమ్ సవాల్ విసిరాడు. తమ మీదకు సిఫాయిలను పంపించడం ఆపి.. ఉన్నతాధికారులే యుద్ధంలోకి దిగాలని వెల్లడించాడు. దీంతో పాక్ అధికారులు.. కాజిమ్ తలపై 10కోట్ల పాకిస్తానీ రూపాయల రివార్డును ప్రకటించారు.