PPM: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వారి ఆధ్వర్యంలో మన్యం జిల్లాలో ఈనెల 27 సోమవారం ఉ. 11 గంటలకు కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతున్నట్లు ప్రోగ్రాం అసిస్టెంట్ జె. శ్యాం సుందరం శుక్రవారం తెలిపారు. ఈ మేరకు కళ్యాణం ఉత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్ను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆవిష్కరించారు. టీటీడీ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.