TPT: దొరవారిసత్రం (M) పోలిరెడ్డిపాలెం సమీపంలోని కాళంగి నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ST కాలనీకి చెందిన ఎనిమిది మంది కమ్మకండ్రిగ సమీపంలో చేపల వేటకు వెళ్లారు. వారిలో M పోలయ్య (31) చేపలు పడుతూ ప్రమాదవశాత్తు జారిపడి నది ప్రవాహానికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ సంగమేశ్వరరావు, MRO శైల కుమారి, SI అజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.