KKD: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై పలువురు సజీవదహనం కావడంపై కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు మృతి చెందడం తనను కలిచి వేసిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.