BDK: మణుగూరు మండల కేంద్రంలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పార్టీ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో BRS గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.