ADB: అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించే ప్రజాహిత కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం 5K రన్ నిర్వహించారు. పట్టణంలోని కలెక్టర్ చౌరస్తా నుంచి కొనసాగిన పరుగు పందెం పలు వీధుల గుండా కొనసాగింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రశాంత జిల్లాకు కారణం ఒకప్పటి పోలీసు ప్రాణ త్యాగాల ఫలితమే అని కొనియాడారు.