TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత వేగవంతం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో.. ఇంటింటి ప్రచారం కోసం రేవంత్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 7 డివిజన్లు ఉండగా.. ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రులకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. ఈ మంత్రులతో ఇవాళ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.