కోనసీమ: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంటుకు చరవాణి ద్వారా ఆదేశాలు జారీ చేశారు.