HYD: కర్నూలు బస్సు అగ్నిప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.