SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సిరిసిల్ల జిల్లాకు నూతనంగా నియామకమైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ దంపతులకు ఆలయ అర్చకులు స్వస్తి వాచకంతో స్వాగతం పలికారు. కలెక్టర్ దంపతులకు ఆలయ ఏఈవో బ్రహ్మన్న గారి శ్రీనివాస్ దేవుడి శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదం అందజేశారు.