AP: పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. నవంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేశామన్నారు.