BHNG: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొత్త పార్టీపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మేలు జరగాలంటే పార్టీలు అవసరం అనేది తప్పనిసరి కాదన్నారు. ప్రజలు కోరుకుంటే, సమయం వచ్చినప్పుడు పార్టీ వస్తుందన్నారు. జాగృతి పార్టీగా మారడం పెద్ద విషయం కాదని, కానీ అది సమయం, సందర్భాలపై ఆధారపడి ఉంటుందన్నారు.