W.G: పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తణుకు పట్టణంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించడమైంది. ఈ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని రక్తదానం చేసిన ఆయన అభిమానులకు జ్ఞాపికలను అందించి, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలానే ఆయన రాబోయే సినిమాలు విజయవంతం కావాలని కోరుకోవడమైంది.