SRCL: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం మని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ చేలుకల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.