NZB: బోధన్ పట్టణంలోని జంగంగల్లిలో పురాణే (పౌడయ్య) మఠం ఆధ్వర్యంలో శ్రీక్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ పాదయాత్ర నేడు ప్రారంభమైంది. వీరశైవ జంగమ లింగాయత్‌ల సహకారంతో గురువారం ఈ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ రాష్ట్ర సభ్యులు శ్యాంరావు మాట్లాడుతూ.. కార్తీక మాసం వీరశైవులకు చాలా విశిష్టమైనదన్నారు.