PLD: మాచర్ల పట్టణ సీఐగా వెంకటరమణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఐగా విధులు నిర్వర్తించిన ప్రభాకర్‌ను వీఆర్‌కు పంపించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ తెలిపారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. పలువురు సీఐ వెంకటరమణకు అభినందనలు తెలిపారు.