CTR: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని AITUC అనుబంధ సంఘమైన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరి మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం నిరసన వ్యక్తం చేశారు. AITUC జిల్లా కార్యదర్శి కోదండన్ మాట్లాడుతూ.. పనిచేస్తూ మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు PF అందలేదని.. వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. నవంబర్ 3న సమ్మె విజయవంతం చెయాలన్నారు.