SKLM: ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యమని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. గురువారం తన కార్యాలయంలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల అధికారులు, నాయకులతో “సింధూర జలసిరి”పై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, కాలువలు నిర్మాణాల పనులకు కావలసిన నిధులు కోసం తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు.