పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జైలులో తనను ఒంటరిగా ఉంచారని, కనీస సదుపాయాలు కల్పించడం లేదని వాపోయారు. బలమైన దేశమంటే రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్వేచ్ఛ వర్ధిల్లడం అని, కానీ ఆసిం మునీర్ సొంత చట్టాన్ని అమలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నారని ఇమ్రాన్ నిప్పులు చెరిగారు.