MNCL: హన్మకొండ జిల్లా మడికొండలోని నమస్తే తెలంగాణ దినపత్రిక కార్యాలయంపై దాడిని ఖండిస్తూ గురువారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పత్రిక కార్యాలయంపై దాడి హేయమైన చర్య అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.