NLG: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంశ్రీ యోజన స్కూళ్లలో ఈ ఏడాది నవంబర్ నుంచి బాలికలకు కరాటే శిక్షణ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు KGBV, కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే ఈ కరాటే శిక్షణ అమలవుతుండగా, తాజాగా జిల్లాలో 36 పీఎంశ్రీ పాఠశాలల్లోనూ అమలు చేయనున్నారు. శిక్షణలో భాగంగా బాలికలకు కరాటే, జూడో, కుంగ్ ఫూ నేర్పిస్తారు.