KMM: అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి, పెసర, వరి రైతులను ఆదుకోవాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి గోపాల్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చింతకాని సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో రేపల్లెవాడ, పాతర్లపాడులో పర్యటించి, అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఒక్కో ఎకరానికి రైతులు రూ. 30 వేలు వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయారని పేర్కొన్నారు.