SRCL: సిరిసిల్ల కోర్టు సీనియర్ న్యాయవాది వరద మారుతిపై దాడిని న్యాయవాదులు ఖండించారు. వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి, కోర్టు ప్రధాన ద్వారం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ.. న్యాయవాదిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.