HNK: హన్మకొండలో ప్రెస్ క్లబ్ వెనుక 2 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడంపై BJP జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ జిల్లా BJP కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ భూమి పై కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించి ఆదాయం పొందే ప్రభుత్వ ప్రయత్నం సరికాదని హెచ్చరించారు. ఈ వేలం భవిష్యత్ తరాలకు భూమిని కోల్పోయేలా చేస్తుందని ఆరోపించారు.