WGL: జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 24 నుంచి 31 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 (ఎస్ఏ-1) పరీక్షలు జరగనున్నట్లు DCEB ఛైర్మన్, DEO డి. వాసంతి ఇవాళ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 70,840 మంది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ టైమ్‌టేబుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు.