MNCL: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో, NEES సహకారంతో బెల్లంపల్లిలో ఈనెల 26న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా జాబ్ క్యాలెండర్ను MLA వినోద్, సింగరేణి C&MD బలరామ్ గురువారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు సింగరేణి సంస్థ అందిస్తున్న ఉద్యోగావకాశాలు ప్రశంసనీయమైనవి. ఈ జాబ్ మేళా ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.