SRPT: తిరుమలగిరి మండలం మాలిపురంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి గురువారం ఎమ్మెల్యే సామేలు శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలను నిర్వీర్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు.