BPT: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా చిన్నగంజాం మండలంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయం కాగా.. నక్కల వాగు, కోంగల వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉప్పుగుండూరు రైల్వే అండర్ పాస్ వద్ద భారీగా చేరిన వరద నీటిని తహసీల్దార్ జె.ప్రభాకరరావు ఇవాళ పరిశీలించారు. ఇంజన్ల ద్వారా నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడివేయిస్తున్న ప్రక్రియను ఆయన పరీక్షించారు.