AP: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచి సమీక్ష నిర్వహించారు. సీఎస్, మంత్రులు, అధికారులతో ఆయన మాట్లాడారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల్లో అధికారులంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా చూడాలన్నారు.