పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘రాజాసాబ్’. ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయనకు విషెస్ చెప్పారు. ఈ మేరకు ప్రభాస్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు తెలిపారు. ఇక హర్రర్ కామెడీ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కాబోతుంది.