KMR: యూత్ కాంగ్రెస్ బలోపేతానికి గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధి మహమ్మద్ ఇలియాస్ చెప్పారు. గురువారం మండల మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో యూత్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ యువతకు పెద్దపీట వేస్తుందన్నారు.