KNR: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇద్దరు కీలక నేతల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, గతంలో KNR పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు ఈ పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరి వైపు అధష్టానం మొగ్గుచూపుతుందో అని ఆసక్తి నెలకొంది.