SRCL: కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ శివారులో మూల వాగు నుంచి ఇసుక రవాణాను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ఇసుక తరలింపుకు తహసీల్దార్ అనుమతులు ఇవ్వడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ట్రాక్టర్లు వాగుకు చేరుకున్నాయి. దీంతో రైతులు, గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్లను అడ్డుకుని ఆందోళన చేపట్టారు.