E.G: కార్తీక మాసం నేపథ్యంలో రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ గోదావరి నది ఒడ్డున ఉన్న పలు స్నానపు ఘాట్లను గురువారం పరిశీలించారు. గోదావరి పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా కావలసిన ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. మహిళలు దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేయాలని, షవర్లు ఏర్పాటు చేయాలన్నారు.