KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుండలా మారడంతో గురువారం ఒక వరద గేటు ఎత్తి 4,048 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.802 టీఎంసీ)లు. ప్రాజెక్టులోకి కూడా 4,048 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోందని ఆయన వెల్లడించారు.