HYD: పోచారంలో కాల్పుల ఘటనపై బీజేపీ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ.. ఎంఐఎం కార్యకర్తలు BJP కార్యకర్తలు, గోరక్షకులపై చేసిన తుపాకీ దాడులను BJP ఖండిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి MIM కార్యకర్తల అరాచకాలు పెరుగుతున్నాయని ఆరోపించారు.