MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం మండలంలోని మర్రిచెట్టు తండా గ్రామంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ అకిలేష్ మాట్లాడుతూ.. రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామింగ్ ఆఫీసర్ అంజన్, స్టాఫ్ నర్స్ అరుణ పాల్గొనారు.