BHPL: చిట్యాల మండలం కొత్తపేట గ్రామంలో గురువారం మాజీ ZPTC సాగర్, BRS మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ స్థానిక నేతలతో కలిసి ఇంటింటికీ తిరిగి “కాంగ్రెస్ బాకీ కార్డులు” పంపిణీ చేశారు. సాగర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో BRS అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.