AP: రాష్ట్రానికి చెందిన 8 మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో బంగ్లాదేశ్ నౌకాదళం వారిని అదుపులోకి తీసుకుంది. బాధితులు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సత్వరమే స్పందించారు. వారిని జాగ్రత్తగా తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.