MDCL: మల్లాపూర్ డివిజన్ పరిధిలో రూ. 60 లక్షలతో సూర్యనగర్ కాలనీ, బాంక్ కాలనీ ప్రధాన రహదారి బీటీ రోడ్డు పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. డివిజన్ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.